నాటు నాటు - బూతు బూతు
మనలో చాలామందికి చిన్న వయసు లో స్నేహితులు, కొంతమంది ముదురు పెద్దలు ఎక్కడంటే అక్కడ బూతులు మాట్లాడటం వలన వాటి గురించి ఒక అవగాహన, అవి ఎక్కడ వాడాలి, ఎక్కడ కూడదు అనే ఒక విచక్షణ వచ్చి ఉంటుంది.
మరీ పద్ధతి గా పెరిగిన కొందరికి మన లాగా డెబ్భై ఏళ్ళు వచ్చినా తెలిసి ఉండకపోవచ్చు.
పిల్లలకైతేనేం, పెద్దలకు ఐతేనేం బూతులు అనర్గళంగా మాట్లాడటం నేర్పించే సాధనాలు మనవాళ్ళు మన తరంలో కనుక్కోలేక పోయారు అనే బెంగ ఇంక అవసరం లేదు.
రానా నాయుడు అనే వెబ్ సీరీస్ వచ్చింది. అది ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు. బూతులలో ఓనమాలు రాని వాళ్ళు పీహెచ్డీ లెవెల్ కి ఎదిగి పోతారు.
నేనైతే మామూలు సంభాషణ లో మరీ నాటు రకం జనం కూడా అంత ఛండాలపు బూతులు మాట్లాడటం వినలేదు.
అమెరికా వాళ్ళు సినిమాలలో ఇలాంటి బూతులు ఇంగ్లీష్ లో యధాలాపంగా వాడుతుంటారు, కానీ వాళ్ళు కూడా ఇంత దరిద్రపు భాష వాడరేమో! షిట్, ఫక్, ఫకింగ్ బాస్టర్డ్ లాంటివి అర్థం తెలిసీ, తెలియక మనవాళ్ళు కూడా వాడేస్తుంటారు, కానీ అవన్నీ మన రానా నాయుడు వెబ్ సీరీస్ ముందు ఎందుకూ పనికి రావనే చెప్పాలి.
సెక్స్ గురించిన అవగాహన కలిగించడానికి చాలా మంది చాలా కృషి చేశారు, కానీ ఇప్పుడు రానా నాయుడు వెబ్ సీరీస్ క్రొత్త ప్రయోగం చేసింది. పరమ నాటు బూతు ప్రయోగం. దీని పర్యవసానం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
Comments
Post a Comment