Mukhbir (ముఖ్బీర్)
ఈమధ్య తెలుగు సినిమాలు పరమ బోరింగ్ అన్న విషయం విదితమే. పెద్ద హీరోల, నిర్మాతల, ఇతర హేమాహేమీల పిల్లలు, కమెడియన్ ప్రక్కన నిలబడే అవకాశం కూడా దొరకని వారితో సమానులే అయినప్పటికీ, ఏకంగా మెగా హీరోలు అవుతున్నారు. ఇప్పుడు వెబ్ సీరీస్ మొదలవడంతో అందరూ చతికిలపడే పరిస్థితి వచ్చేసింది. ఈ మధ్య వచ్చిన “రెక్కీ” (Recce) ఏడు ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అలరించింది. అందులో “ఆడుకాలం నరేన్” మరియు “సమ్మెట గాంధీ” వారి నటనా చాతుర్యం తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు “ముఖ్బీర్” (The story of a spy) ఎనిమిది ఎపిసోడ్స్ తో ౙీ5 లో హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. సబ్ టైటిల్స్ హిందీ, ఇంగ్లీష్ లో లభిస్తాయి. ఇది ఒక అద్భుతమైన వెబ్ సీరీస్. మన మామూలు సినిమాలతో పోలిస్తే చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఆర్టిస్ట్ ల సెలెక్షన్, స్క్రీన్ప్లే, డైలాగ్స్, ఫోటోగ్రఫీ అన్నీ ఎక్సలెంట్. Hero is really handsome. There is a lot of decency when he flirts with Begum Anar. And in an equally decent manner, she too responds. And when he kills her for the sake of his country, one will be taken aback and...