Crime Thrillers in Telugu Cinema
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు
తెలుగు సినిమాలలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఒకప్పుడు చాలా ఘోరంగా చిత్రీకరించే వారు. అన్నీ సినిమాలకూ ఒక స్టాండర్డ్ ప్యాటర్న్ ఉండేది. ఒక ఫైట్, హీరో కొడితే విలన్లు ఎగిరి ఆమడ దూరంలో పడతారు. లారీజనాన్ని హీరో ఒంటరిగా తుక్కు తుక్కు గా కొట్టాక ఒక డ్యూయెట్, హీరోయిన్ ఇంకా ఒక గుంపు తో తైతక్కలు. తరువాత కమెడియన్ తో హాస్యం. జనాల్ని ఆకర్షించే అంశాలు ఇవీ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. హీరోలు, మెగా హీరోలు ఈ మూసను అనుసరించి విజయాలు అందుకునేవారు. క్రైమ్ సినిమా లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియకుండా పోయింది.
ఈ మధ్య ఒక మూడు క్రైమ్ సినిమాలు చూసిన తరువాత తెలుగు క్రైమ్ ఫిలింస్ తొలిసారిగా ఒక ఉన్నత స్థాయికి ఎదిగాయి అని అనిపిస్తుంది.
మొదట హిట్: ది సెకండ్ కేస్ చూసాను. అడివి శేష్ హీరోగా బాగా చేసాడు అనిపించింది.
అయితే హిట్: ది ఫస్ట్ కేస్ ఒక క్రొత్త హీరో తో తీసారు కనుక ఆ తలనొప్పి సినిమా ఏం చూస్తాం లే అని చాలా రోజులు చూడలేదు. కానీ, విష్వక్సేన్ అనే హీరో ఇరగదీశాడు అని చెప్పక తప్పదు.
ఆ తరువాత ఎవరు అనే క్రైమ్ థ్రిల్లర్ మళ్ళీ అడివి శేష్ హీరోగా తీసారు. ఈ సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పరంగా అత్యుత్తమ స్థాయిలో ఉందని చెప్పక తప్పదు. రెజీనా కసండ్రా, అడివి శేష్, నవీన్ చంద్ర అభినయం కూడా సినిమా రేటింగ్ను బాగా పెంచేసింది అని చెప్పాలి.
మనకు తెలుగు సినిమాలలో ఈ సినిమాలకి ముందు నేర పరిశోధన నామ మాత్రంగానే ఉండేది. అలాంటివి కావాలంటే మలయాళ సినిమాలు చూసుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఈ మూడు సినిమాల తర్వాత ఆశలు చిగురిస్తున్నాయి. మన తెలుగులో కూడా గ్లోబల్ వ్యూయర్స్ కి కావలసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కావలసినన్ని రాబోతున్నాయి అని ఋజువు అవుతుంది. మెగా హీరోలు ఒమెగా హీరోలయి (అంటే slide from Alpha to Omega అన్నమాట) వారి స్థానంలో క్రొత్త హీరోలు వస్తున్నారు.
ఇంక ముందు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కావాలనుకునే ప్రేక్షకులకు మంచి రోజులు రానున్నాయి అని అనిపిస్తుంది.
Comments
Post a Comment